వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బుసినె విరూపాక్షిక హైకోర్టు బెయిల్ మంజూరు: భారీ ఊరట

రిపోర్టర్: భాస్కర్ స్థలం: కర్నూలు

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆలూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బుసినె విరూపాక్షికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసినట్లు న్యాయవర్గాలు వెల్లడించాయి. గత ఆగస్టు 1వ తేదీన చిప్పగిరిలో జరిగిన ఘర్షణకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ఆయన అరెస్టయ్యారు. కర్నూలు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా 68 రోజులుగా గడుపుతున్న ఆయనకు, కోర్టు విధించిన నిబంధనలకు అనుగుణంగా తగు పత్రాలు సమర్పించిన తర్వాత విడుదల కానున్నారు.