గొర్రెల కాపరులకు అయిదు వేల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్

రిపోర్టర్: వెంకట్ స్థలం: తుంగతుర్తి

అరవై ఏళ్లు నిండిన గొర్రెల కాపరులకు మిగతా వృత్తిదారుల లాగే ఐదు వేల రూపాయల పింఛను అందించాలని గొర్రెలు మేకల పెంపకందారుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి బొల్లం అశోక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం తుంగతుర్తి కేంద్రంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. గొర్రెలు మేకల పెంపకందారుల స్థితిగతులు తెలుసుకోవడం కోసం నిర్వహించిన ఈ కార్యక్రమంలో జీఎంపీఎస్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని నాయకులు కోరారు.