ఎర్రవల్లి భూముల సర్వేకు ఆదేశాలు: అమరవీరుల కాలనీ ఏర్పాటుకు సీఎం రేవంత్ శ్రీకారం

రిపోర్టర్: కృష్ణ స్థలం: సిద్దిపేట

సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి భూముల అన్వేషణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. రికార్డులకు, వాస్తవాలకు మధ్య ఉన్న నలభై ఐదు ఎకరాల తేడాను గుర్తించేందుకు వెంటనే సర్వే నోటిఫికేషన్ విడుదల చేయాలని స్పష్టం చేశారు. గుర్తించిన భూమిలో తెలంగాణ అమరవీరుల కాలనీ నిర్మించడంతో పాటు వెలికట్టలో ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.