జనరంజక నాయకుని జన్మదిన వేడుకలతో పులకించిన పల్లెసీమ
రిపోర్టర్: Balaji
స్థలం: పిచ్చాటూరు
తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం పిచ్చాటూరు మండలం రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు వైఎస్ఆర్సిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కే.టి. హరిశ్చంద్ర రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి ప్రజలకు పంపిణీ చేశారు. కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున పాల్గొని నాయకునిపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. ప్రజా సేవలో ఆయన మరిన్ని శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.