బెంగాల్ ఉప ఎన్నికల్లో మమతా బెనర్జీ వర్గానికి మరో ఎదురుదెబ్బ
రిపోర్టర్: కిరణ్
స్థలం: పశ్చిమ బెంగాల్
పశ్చిమ బెంగాల్ లోని రెజిన్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక నుంచి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ వర్గ అభ్యర్థి రబియుల్ ఆలం చౌదరి తన నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు. కొత్త ఎన్నికల గుర్తును ఓటర్లకు పరిచయం చేయడం కష్టమనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. అంతకుముందు నందిగ్రామ్ అభ్యర్థి సంచిత ప్రధాన్ దే కూడా పోటీ నుంచి తప్పుకోవడం మమతా వర్గానికి పెద్ద రాజకీయ ఎదురుదెబ్బగా మారింది.