నారావారిపల్లెలో చంద్రబాబు తల్లిదండ్రుల సమాధులను సందర్శించిన బండ్ల గణేష్
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: తిరుపతి
ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెను సందర్శించారు. చంద్రబాబు తల్లిదండ్రులు ఖర్జూరపు నాయుడు, అమ్మనమ్మ సమాధులకు నివాళులర్పించారు. ఎంత గొప్ప బిడ్డను కన్నారంటూ ఆయన భావోద్వేగంగా స్పందించారు. చంద్రబాబును వాటర్‌మ్యాన్ ఆఫ్ ఏపీగా అభివర్ణిస్తూ, దేశానికి మహానాయకుడిని అందించిన ఆ తల్లిదండ్రులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని బండ్ల గణేష్ తెలిపారు.