నటుడు సుహాస్ కెరీర్ ఆరంభ అవమానాలపై మండాడి దర్శకుడి వ్యాఖ్యలు
రిపోర్టర్: సతీష్
స్థలం: తెలంగాణ
మండాడి సినిమా సక్సెస్ ఈవెంట్‌లో ఆ చిత్ర దర్శకుడు మతిరామన్ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. నటుడు సుహాస్ తన కెరీర్ ఆరంభంలో రంగు ఆధారంగా ఎదుర్కొన్న అవమానాలను దర్శకుడు ప్రస్తావించారు. సుహాస్ నల్లగా ఉన్నాడంటూ సొంత ఊర్లోనూ కొందరు ఎద్దేవా చేశారని, అయితే తమిళనాడులో అలాంటి వివక్ష ఉండదని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు, సినీ విశ్లేషకులు స్పందిస్తూ తెలుగు ప్రేక్షకులు రంగును కాకుండా ప్రతిభను, మంచి కథలను మాత్రమే ఆదరిస్తారని స్పష్టం చేస్తున్నారు.