ఓటు వేయడానికి ఫొటో ఓటర్ స్లిప్పు తప్పనిసరి కాదని కమిషనర్ స్పష్టీకరణ
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: విజయవాడ
విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో కమిషనర్ ధ్యానచంద్ర ఆధ్వర్యంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఓటర్లకు ఫొటో ఓటర్ స్లిప్పుల ముద్రణ, పంపిణీకి సంబంధించిన మార్గదర్శకాలను ఆయన వివరించారు. ఓటర్లకు సంబంధిత పోలింగ్ కేంద్రం నంబరు, క్రమ సంఖ్య తెలుసుకునేందుకు ఈ స్లిప్పులు ఉపయోగపడతాయని తెలిపారు.