న్యూఢిల్లీలో ముగిసిన 18వ బ్రిక్స్ సదస్సు

రిపోర్టర్: రమేష్ స్థలం: New Delhi

న్యూఢిల్లీ వేదికగా జరిగిన 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో న్యూఢిల్లీ డిక్లరేషన్‌ను ఏకగ్రీవంగా ఆమోదించారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు చైనా, రష్యా, ఇరాన్ అధ్యక్షులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఉగ్రవాదంపై పోరు, వాణిజ్యం, వాతావరణ మార్పులు, ప్రపంచ పాలనలో సంస్కరణలపై ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.