రాహుల్ గాంధీ పర్యటనను వ్యతిరేకించిన మృతుడి తండ్రి: భీమ్ సింగ్ స్పష్టీకరణ
రిపోర్టర్: వెంకట్
స్థలం: Mansa
మృతి చెందిన కార్యకర్త పర్విందర్ సింగ్ జోటా తండ్రి భీమ్ సింగ్ సంచలన ప్రకటన చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తమ నిరసన దీక్షకు రావద్దని సోమవారం స్పష్టం చేశారు. సిక్ కు సమాజంలో ఉన్న మనోవేదనను దృష్టిలో ఉంచుకుని ఇందిరా గాంధీ కుటుంబ సభ్యులు దూరంగా ఉండాలని ఆయన కోరారు. ఇతర కాంగ్రెస్ నేతలు రావొచ్చని పేర్కొంటూ, తమపై పెట్టిన కేసులు ఎత్తివేసే వరకు అధికారులతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు.