కాకినాడ నుంచి రైలు మార్గంలో వుడ్ పల్ప్ రవాణా

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: కాకినాడ

కాకినాడ పోర్టు నుంచి మహారాష్ట్రలోని భిగ్వాన్‌కు దక్షిణ కోస్తా రైల్వే చొరవతో మొదటిసారిగా రోడ్డు మార్గం నుంచి రైలు మార్గానికి వుడ్ పల్ప్ రవాణా విజయవంతంగా మారినట్లు అధికారులు తెలిపారు. గత పదిహేనేళ్లుగా రోడ్డు మార్గంలో తరలిస్తున్న ఈ సరుకు రవాణాను రైల్వే బోర్డు టారిఫ్ హేతుబద్ధీకరణ ద్వారా చౌకగా మార్చారు. దీనివల్ల దక్షిణ కోస్తా రైల్వేకు ఏడాదికి సుమారు ఒకటిన్నర లక్షల టన్నుల అదనపు లోడింగ్ తో పాటు ఇరవై కోట్ల రూపాయల వార్షిక ఆదాయం సమకూరనుంది.