ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్కు అమరావతి క్వాంటమ్ వ్యాలీ గోల్డ్ అవార్డు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: Andhra Pradesh
అమరావతి క్వాంటమ్ వ్యాలీ డిజిటల్ మరియు సోషల్ మీడియా ప్రచారం, అవగాహన కార్యక్రమం కింద ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్కు గోల్డ్ అవార్డు లభించిందని CMO Andhra Pradesh వెల్లడించారు. దేశవ్యాప్తంగా అత్యంత పరిమిత సంఖ్యలో అందించిన గోల్డ్ అవార్డుల్లో ఒకటి ఏపీడీసీకి దక్కడం గర్వకారణమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ ప్రచార విధానానికి ఈ పురస్కారం దక్కడం ద్వారా ప్రభుత్వ ప్రతిష్ట మరింత ఇనుమడించిందని, సాంకేతికతను జోడించి చేపట్టిన కార్యక్రమాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం హర్షణీయమని పేర్కొన్నారు.