ఉజ్జ్వల లబ్ధిదారులకు దీపావళి కానుక: ఉచితంగా ఎల్పీజీ సిలిండర్లు అందించనున్న యోగి సర్కార్
రిపోర్టర్: రమేష్
స్థలం: లక్నో
ఉత్తరప్రదేశ్ లోని ప్రధాన మంత్రి ఉజ్జ్వల యోజన లబ్ధిదారులకు దీపావళి మరియు హోలీ పండుగల సందర్భంగా ఉచితంగా ఎల్పీజీ సిలిండర్లు అందించనున్నట్లు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. రాష్ట్రంలోని కోటీ ఎనభై తొమ్మిది లక్షలకు పైగా లబ్ధిదారుల ఖాతాల్ లో సబ్సిడీ నిధులు జమ చేసే కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ పథకం కింద సిలిండర్ల రీఫిల్ సబ్సిడీల పంపిణీ కోసం వేయి ఐదు వందల కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని ప్రభుత్వం కేటాయించినట్లు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.