చికిత్స నిమిత్తం చిన్నారికి సీఎం రేవంత్ రెడ్డి భరోసా

రిపోర్టర్: రాజేష్ స్థలం: Telangana

కరీంనగర్ జిల్లాకు చెందిన ఇరవై ఏడు రోజుల చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి వైద్యానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అన్ని విధాలా సాయం అందించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఆర్థిక పరిస్థితి లేక ఇబ్బందులు పడుతున్న కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.