పల్నాడులో ఉద్రిక్తత: వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు, నేతల హౌస్ అరెస్ట్

రిపోర్టర్: సునీల్ స్థలం: Palnadu

పల్నాడు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు భద్రతను అత్యంత కట్టుదిట్టం చేశారని అధికారులు వెల్లడించారు. గత ఎన్నికల్ లో జరిగిన హింసాత్మక ఘటనల దృష్ట్యా మాజీ ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడుతో పాటు మాజీ మంత్రి విడుదల రజినిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పలువురు వైసీపీ నేతలను బైండోవర్ చేసి స్టేషన్లకు తరలించారు. ఎలాంటి అశాంతికి పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.