'ఆదివాసీ సంక్షేమానికి రూ.37వేల కోట్లు': కేసీఆర్ వెల్లడి

రిపోర్టర్: విజయ్ స్థలం: Hyderabad

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (KCR ఆదివాసీ సంక్షేమం కోసం రూ.37వేల కోట్లు ఖర్చు చేశామని, 6 లక్షల మందికి పోడు పట్టాలు అందించామని వెల్లడించారు. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చామని, 10 శాతానికి రిజర్వేషన్లు పెంచామని తెలిపారు. గిరిజన సర్వతోముఖాభివృద్ధికి ప్రత్యేక పథకాలు అమలు చేశామని పేర్కొంటూ, చేవెళ్ల డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని కేసీఆర్ తీవ్రంగా విమర్శించారు.