మెగాస్టార్ కాకా సినిమాపై మరోసారి లీక్స్ ఇచ్చిన చిరంజీవి
రిపోర్టర్: నరేష్
స్థలం: Hyderabad
దర్శకుడు బాబి కొల్లి తెరకెక్కిస్తున్న కాకా సినిమాకు సంబంధించి మెగాస్టార్ చిరంజీవి మరోసారి ఆసక్తికర లీక్స్ ఇచ్చారు. తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, ఈ చిత్రంలో తన పాత్ర పేరు కదిరి కాళిదాస్ అని వెల్లడించారు. గ్లింప్స్ లో సత్యం పాత్ర పేరు చూపించడం, తాజాగా చిరు కాళిదాస్ అనడంతో సినిమా కథపై అభిమానుల్లో కొత్త చర్చ మొదలైంది. తండ్రీకూతుళ్ల భావోద్వేగాలతో సాగే ఈ చిత్రం 2027 జనవరి 13న విడుదల కానుంది.