వర్ధన్నపేటలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలకు సర్వం సిద్ధం చేసిన మున్సిపల్ యంత్రాంగం

రిపోర్టర్: BHANUCHANDER DOMMATI స్థలం: వర్ధన్నపేట

వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలోని రామలీల మైదానంలో సద్దుల బతుకమ్మ వేడుకల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మున్సిపల్ చైర్మన్ సారంగపాణి గురువారం మైదానంలో జరుగుతున్న పనులను పరిశీలించారు. మహిళలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా విద్యుత్ దీపాల అలంకరణ, తాగునీరు, పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకలను దిగ్విజయంగా నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు.