ఖమ్మం ప్రభుత్వ వైద్యశాలలో పెన్షనర్ల సమస్యలపై సూపరింటెండెంట్‌కు వినతి
రిపోర్టర్: amudala Venkanna
స్థలం: ఖమ్మం అర్బన్
ఖమ్మం ప్రభుత్వ వైద్యశాలలో పెన్షనర్లు, సీనియర్ సిటిజన్లు ఎదుర్కొంటున్న వైద్య సమస్యలపై TAPRPA ప్రతినిధులు సూపరింటెండెంట్ నరేంద్రకు వినతిపత్రం అందజేశారు. ముఖ్యంగా బీపీ, ప్రోస్టేట్ మందుల కొరత, స్పెషలిస్ట్ వైద్యుల అందుబాటుపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. స్పందించిన సూపరింటెండెంట్ నరేంద్ర, తక్షణమే మందుల నిల్వలను పెంచుతామని, స్పెషలిస్ట్ వైద్యులను అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పెన్షనర్ల ఆరోగ్య సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.