అల్లూరి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయినిగా బి.బి.విజయ ఎంపిక

రిపోర్టర్: Laxman Regam స్థలం: అనంతగిరి

అల్లూరి సీతారామరాజు జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయిని పురస్కారానికి కాశీపట్నం ఎంపీపీ పాఠశాల ఉపాధ్యాయిని బి.బి.విజయ ఎంపికయ్యారు. విద్యార్థుల విద్యాభివృద్ధి, క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసం కోసం ఆమె చేస్తున్న నిరంతర కృషికి గుర్తింపుగా ఈ గౌరవం లభించింది.

విద్యార్థుల ప్రతిభను వెలికితీసేందుకు విజయ చూపుతున్న అంకితభావం అభినందనీయమని తోటి ఉపాధ్యాయులు కొనియాడారు. ఈ పురస్కారం ఆమెకు మరింత స్ఫూర్తినిస్తుందని ఆకాంక్షిస్తూ, పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆమెకు ఘనంగా అభినందనలు తెలియజేశారు.