ఢిల్లీ విశ్వవిద్యాలయ ఎన్నికల ఉల్లంఘనలపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: రాము
స్థలం: ఢిల్లీ
ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం ఎన్నికల ప్రచారంలో నిబంధనల ఉల్లంఘనలు మరియు హింసాత్మక ఘటనలపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనలు పాటించకపోతే ఓట్ల లెక్కింపు నిలిపివేస్తామని హెచ్చరిస్తూ, ఫలితాల తర్వాత విజయోత్సవ ర్యాలీలను నిషేధించింది. నంబర్ ప్లేట్లు లేని వాహనాల ప్రవేశంపై అధికారులను నిలదీసిన న్యాయస్థానం, బాధ్యులైన అభ్యర్థులకు షోకాజ్ నోటీసులు జారీ చేసి రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.