చౌటుప్పల్లో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు
రిపోర్టర్: Chinukani Yuvaraju
స్థలం: చౌటుప్పల్
చౌటుప్పల్ పట్టణంలోని విశాల భారతి హైస్కూల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చిన్ని కృష్ణుడు, గోపికమ్మల వేషధారణలో అలరించగా, సాంస్కృతిక కార్యక్రమాలు, ఉట్టి కొట్టే కార్యక్రమం ఉత్సాహంగా సాగింది.
పాఠశాల కరస్పాండెంట్ వీసం చైతన్య క్రాంతి వర్ధన్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకృష్ణుడి గొప్పతనాన్ని తెలుసుకోవడంతో పాటు విద్యార్థుల్లో ఆధ్యాత్మిక చింతన పెంపొందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ముత్యం శ్రీనివాస్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.