మోటకొండూరులో బిజేవైఎం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహణ
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: మోటకొండూరు
యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండల కేంద్రంలో శనివారం బీజేవైఎం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. నరేంద్ర మోదీ ప్రజాప్రతినిధిగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. బిజేవైఎం మండల అధ్యక్షుడు భూమండ్ల సతీష్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో రాజేంద్రప్రసాద్, ఎస్సై కుమారస్వామి యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొని రక్తదాతలను అభినందించారు. స్థానిక నేతలు, ప్రజలు విశేషంగా పాల్గొన్నారు.