రూ. 8 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ జీఎస్టీ సూపరింటెండెంట్

రిపోర్టర్: భాస్కర్ స్థలం: Bengaluru

కర్ణాటక రాజధాని బెంగళూరులో లోకాయుక్త పోలీసులు జరిపిన దాడిలో ఎనిమిది లక్షల రూపాయల లంచం తీసుకుంటూ సెంట్రల్ జీఎస్టీ సూపరింటెండెంట్ మోహిత్ ప్రతాప్ సింగ్, ఆయన ఏజెంట్ సల్మాన్ షేక్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఇనుప సామాగ్రి వ్యాపారం చేసే ఓ వ్యక్తిపై నమోదైన కేసును మూసివేసేందుకు నిందితులు ఇరవై లక్షలు డిమాండ్ చేయగా, చివరకు ఎనిమిది లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన లోకాయుక్త పోలీసులు కోరమంగళలోని కేంద్ర సదన్ వద్ద వలపన్ని నిందితులను అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.