విద్యార్థుల మానసిక ఆరోగ్యానికి పెద్దపీట: గుజరాత్ సర్కార్ సంచలన నిర్ణయం

రిపోర్టర్: హరి స్థలం: అమరావతి

విద్యార్థులలో పరీక్షల ఒత్తిడిని తగ్గించి ఆత్మహత్యలను నివారించేందుకు సెకండరీ మరియు హయ్యర్ సెకండరీ పాఠశాలల్ లో ప్రత్యేక మానసిక ఆరోగ్య సహాయ వ్యవస్థలను తప్పనిసరి చేస్తూ గుజరాత్ ప్రభుత్వం నూతన నిబంధనలను తీసుకువచ్చినట్లు అధికారిక ప్రకటన ద్వారా వెల్లడించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా మ్మిది నుండి పన్నెండో తరగతి చదివే విద్యార్థుల కోసం ప్రతి పాఠశాలలోనూ ప్రత్యేక వెల్నెస్ బృందాలను ఏర్పాటు చేయాలని అధికారులు స్పష్టం చేశారు.