మల్దకల్ లోని రైస్ మిల్లులు మరియు గోదాముల్ లో విజిలెన్స్ అధికారుల తనిఖీలు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: జోగులాంబ గద్వాల

జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రంలోని రైస్ మిల్లులు మరియు గోదాముల్ లో జిల్లా విజిలెన్స్ అధికారి ప్రశాంత్ గౌడ్ ఆధ్వర్యంలో అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు వెల్లడైంది. ప్రభుత్వ ధాన్యం నిల్వలు, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించామని, పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. ఈ తనిఖీలతో స్థానిక మిల్లుల వర్గాల్ లో తీవ్ర కలకలం రేగింది.