జంతర్ మంతర్ నిరసన కేసు: సీజేపీ నేతల విడుదలపై రత్న సింగ్ స్పందన
రిపోర్టర్: రమేష్
స్థలం: న్యూఢిల్లీ
జంతర్ మంతర్ నిరసన కేసులో అరెస్టయిన తమ పార్టీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా విడుదల కావడంపై కాక్రోచ్ జనతా పార్టీ లీగల్ హెడ్ రత్న సింగ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం చాలా కాలం క్రితమే తీసుకోవాల్సి ఉండేనని ఆమె పేర్కొన్నారు. అక్టోబర్ 14న జరిగిన నిరసనల నేపథ్యంలో వారిద్దరి జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఉత్తర్వుల మేరకు వారు విడుదలయ్యారని ఆమె స్పష్టం చేశారు.