ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్: 12వ పీఆర్సీ, డీఏల విడుదల
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: అమరావతి
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 12వ పీఆర్సీ నియామకానికి అంగీకారం తెలపడంతో పాటు, పెండింగ్లో ఉన్న రెండు డీఏలను అక్టోబర్ 1 నుంచి చెల్లించనున్నారు. 2022 సరెండర్ లీవ్స్ బకాయిలను సంక్రాంతికి జమ చేస్తామని, పోలీసులకు అదనపు లీవ్ ఇస్తామని ప్రకటించారు. ఈ నిర్ణయాల వల్ల ప్రభుత్వంపై ఏటా రూ.2,880 కోట్ల అదనపు భారం పడనుంది.