నర్సంపేటకు మహిళా ఎస్ఐ: 13 ఏళ్ల తర్వాత నిహారికకు బాధ్యతలు
రిపోర్టర్: T.RAJASHEKAR
స్థలం: నర్సంపేట
వరంగల్ జిల్లా నర్సంపేట పోలీస్ స్టేషన్కు సుదీర్ఘ విరామం తర్వాత మహిళా ఎస్ఐ రానున్నారు. గతంలో 2013లో ఇక్కడ శ్రీదేవి ఎస్ఐగా సేవలందించగా, మళ్లీ పదమూడేళ్ల తర్వాత నిహారిక బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఆమె బదిలీపై నర్సంపేటకు వస్తున్నారు. ఈ నియామకంతో స్థానిక మహిళా సమస్యల పరిష్కారానికి మరింత ఊతం లభిస్తుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.