హైదరాబాద్ మెట్రో పాడ్ కార్ల ప్రాజెక్టు: సుమారు 185 ఎకరాల భూమి అవసరం
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్ నగరంలో ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు చేపట్టిన మెట్రో పాడ్ కార్ల ప్రాజెక్టు కోసం సుమారు నూట ఎనభై ఐదు ఎకరాల భూమి అవసరమని అధ్యయన సంస్థ లీ అసోసియేట్స్ స్పష్టం చేసినట్లు అధికారులు తెలిపారు. కూకట్పల్లి, హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాలలో డిపోల ఏర్పాటుకు ఈ భూములు కేటాయించాలని ప్రతిపాదించారు. ఐటీ కారిడార్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఈ పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ ఎంతో దోహదపడుతుందని నివేదిక వెల్లడించింది.