తిరుమలలో వైభవంగా సాగిన శ్రీవారి గరుడవాహన సేవ

రిపోర్టర్: హరి స్థలం: తిరుమల

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఐదో రోజు రాత్రి గరుడవాహన సేవ అత్యంత వైభవంగా సాగింది. బంగారు గరుడ వాహనంపై మలయప్ప స్వామి మాఢవీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. ఈ దివ్య వేడుకను తిలకించేందుకు అశేష సంఖ్యలో భక్తజనం తిరుమలకు పోటెత్తారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటు అన్నప్రసాదాలు, తాగునీరు అందించింది.