బయటి విమర్శలు నన్ను కూడా బాధిస్తాయి: సంజూ శాంసన్

రిపోర్టర్: విజయ్ స్థలం: New Delhi

టీమిండియాలో చోటు కోసం తీవ్ర పోటీ మధ్య విమర్శలను ఎదుర్కొనే విధానంపై వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బయట నుంచి వచ్చే విమర్శలు తనను కూడా బాధిస్తాయని, తాము రోబోలం కాదని అన్నారు. అయితే, అలాంటి వాటిని పట్టించుకోకుండా వై-ఫై ఆఫ్ చేసినట్లుగా మైండ్ నుంచి తొలగించి ఆటపైనే పూర్తిగా దృష్టి పెడుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.