తుమ్మిడిహట్టి బ్యారేజీ ఎత్తు పెంపుపై మహారాష్ట్ర సీఎంతో రేవంత్ రెడ్డి కీలక భేటీ

రిపోర్టర్: రమేష్ స్థలం: Mumbai

తెలంగాణ సాగునీటి అవసరాలను పూర్తిగా తీర్చడం కోసం ప్రాణహిత నదిపై ఉన్న తుమ్మిడిహట్టి బ్యారేజీ ఎత్తును 148 మీటర్ల నుంచి 152 మీటర్లకు పెంచే అంశంపై చర్చించేందుకు ముంబైలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారని తెలంగాణ సీఎంఓ వెల్లడించారు. ఈ సమావేశంలో రాష్ట్ర నీటిపారుదల శాఖకు సంబంధించిన కీలక మంత్రులు, ఉన్నతాధికారులు కూడా పాల్గొని రెండు రాష్ట్రాల మధ్య పరస్పర ప్రయోజనాలపై చర్చలు జరిపారు.