దిల్లీలో కలకలం: కోచ్రోచ్ జనతా పార్టీ నేతల అరెస్ట్, జ్యుడీషియల్ కస్టడీకి
రిపోర్టర్: అశోక్
స్థలం: Delhi
నిషేధిత ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద నిరసనకు యత్నించిన కోచ్రోచ్ జనతా పార్టీకి చెందిన పద్నాలుగు మంది సభ్యులపై దిల్లీ పోలీసులు రెండు వేర్వేరు కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ప్రధాన నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రంకాలకు ఐదు రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించగా, మరో సభ్యుడు అజింక్య షిండేను బైండ్ డౌన్ చేసినట్లు పోలీసులు స్పష్టం చేశారు.