సమాజ్ వాదీ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా ధన్రాజ్ నాథ్వాని
రిపోర్టర్: రాము
స్థలం: Lucknow
సమాజ్ వాదీ పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్ ప్రెసిడెంట్ ధన్రాజ్ పరిమళ్ నాథ్వాని నామినేషన్ దాఖలు చేసినట్లు రాజకీయ వర్గాలు వెల్లడించాయి. ఈ పరిణామం ద్వారా ఎస్పీ, అంబానీ కుటుంబాల మధ్య రెండు దశాబ్దాలకు పైగా ఉన్న సాన్నిహిత్యం మరోసారి నిరూపితమైందని విశ్లేషకులు పేర్కొన్నారు. గతంలో ములాయం సింగ్ యాదవ్ కూడా అనిల్ అంబానీకి మద్దతు తెలిపారని, అఖిలేష్ యాదవ్ ఈ కార్పొరేట్-రాజకీయ బంధాన్ని కొనసాగిస్తున్నారని స్పష్టం చేశారు.