స్థానిక ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్పష్టత
రిపోర్టర్: సునీల్
స్థలం: Tirupati
ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్పష్టతనిచ్చారు. తిరుపతిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, సమర్థులైన అభ్యర్థులకే టికెట్లు కేటాయిస్తామని ఖరాఖండిగా తేల్చిచెప్పారు. కూటమి భాగస్వాముల మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ ఫేక్ సోషల్ మీడియా ఖాతాలతో కుట్రలు పన్నుతోందని పల్లా శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.