హెచ్-1బీ వీసా గ్రేస్ పీరియడ్ రద్దుకు ట్రంప్ సర్కార్ ప్రతిపాదన
రిపోర్టర్: మహేష్
స్థలం: World
అమెరికాలో హెచ్-1బీ వీసాదారులకు ట్రంప్ సర్కార్ షాకిచ్చింది. ఉద్యోగం కోల్పోయిన తర్వాత కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి ప్రస్తుతం ఇస్తున్న 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను రద్దు చేయాలని ప్రతిపాదించింది. ఇది అమల్లోకి వస్తే ఉద్యోగం పోయిన మరుసటి రోజే దేశం విడిచి వెళ్లాల్సి వస్తుంది. ఈ నిర్ణయంతో భారతీయ టెకీలలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.