నవీ ముంబైలో క్యాబ్ డ్రైవర్ చేతిలో మహిళపై లైంగిక దాడి యత్నం.

రిపోర్టర్: రాము స్థలం: మహారాష్ట్ర

నవీ ముంబై ఎయిర్‌పోర్టు సమీపంలో క్యాబ్ డ్రైవర్ మహిళపై లైంగిక దాడికి యత్నించాడు. చెంబూర్‌లోని పార్టీ ముగించుకుని పన్వెల్ వెళ్తున్న మహిళను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నిందితుడు వెనుక సీటులోకి వచ్చి దాడికి యత్నించగా, మహిళ చాకచక్యంగా తప్పించుకుని పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు నిందితుడు మొహమ్మద్ అఫ్జల్ షేక్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.