పెరుగుతున్న సెలబ్రిటీ హోదా: వ్యక్తిగత భద్రతను ఏర్పాటు చేసుకున్న స్టార్ బాస్కెట్ బాల్ ప్లేయర్

రిపోర్టర్: శివ స్థలం: ఇండియానా

పెరుగుతున్న ప్రజా ఆదరణ కారణంగా సాధారణ జీవితాన్ని గడపడం కష్టంగా మారిందని, అందుకే తనకు రక్షణగా 24 గంటలు వెంట ఉండేలా ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నట్లు ఇండియానా ఫీవర్ జట్టు స్టార్ బాస్కెట్ బాల్ క్రీడాకారిణి సోఫీ కన్నింగ్హ వెల్లడించారు. తన నో హెసిటేషన్ పాడ్కాస్ట్ వేదికగా ఆమె మాట్లాడుతూ, అభిమానులను ఎప్పుడూ స్వాగతిస్తానని, అయితే కుటుంబంతో గడపడానికి మరియు ప్రైవసీని కాపాడుకోవడానికి ఈ రక్షణ చర్యలు అత్యవసరమని స్పష్టం చేశారు.