తుపాను నష్టాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు లేఖ
రిపోర్టర్: మహేష్
స్థలం: అమరావతి
మురసు తుపాను కారణంగా ప్రాథమికంగా రూ.343 కోట్ల ఆస్తినష్టం జరిగిందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు సీఎం చంద్రబాబు లేఖ రాశారు. ఏడు జిల్లాల్ లో 465 గ్రామాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని, 50,473 హెక్టార్లలో వరిపంట దెబ్బతిందని ఆయన వివరించారు. సాధారణ పరిస్థితులు నెలకొనేలా రైతులకు సాయం అందించేందుకు వెంటనే తాత్కాలిక సాయం ప్రకటించాలని సీఎం కోరారు. మరోవైపు మిర్చి కంటైనర్ల నిలిపివేతపై కూడా కేంద్రమంత్రి పీయూష్ గోయిల్ కు లేఖ రాశారు.