మద్యం అక్రమాలపై వైఎస్ జగన్‌పై ఏపీఎస్బీసీఎల్ మాజీ అధికారి సంచలన వాంగ్మూలం
రిపోర్టర్: శివ
స్థలం: అమరావతి
వైకాపా హయాంలో జరిగిన మద్యం అక్రమాలు, డిస్టిలరీల నుంచి వసూలు చేసిన లంచాల సొమ్ము నేరుగా నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికే చేరినట్లు ఏపీఎస్‌బీసీఎల్ అప్పటి ప్రత్యేకాధికారి డి.సత్యప్రసాద్ న్యాయాధికారి సమక్షంలో వాంగ్మూలమిచ్చారు. తయారీ, సరఫరా వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుని వేలకోట్లు దండుకున్నారని, నాసిరకం మద్యం సరఫరా వల్ల వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఈ దర్యాప్తులో వెల్లడైంది.