సోషల్ మీడియాలో ఫేక్ ఖాతాలపై దర్శకుడు జేసన్ సంజయ్ తీవ్ర హెచ్చరిక

రిపోర్టర్: సురేష్ స్థలం: చెన్నై

సోషల్ మీడియాలో తన పేరుతో చెలామణి అవుతున్న నకిలీ ఖాతాలపై ప్రముఖ దర్శకుడు జేసన్ సంజయ్ తీవ్రంగా స్పందించారు. తన అధికారిక ప్రొఫైల్స్ మినహా ఇతర అకౌంట్లతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన తన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఎక్స్ ఖాతాల వివరాలను వెల్లడించారు. తన పేరుతో జరిగే ఎలాంటి వ్యాపార లావాదేవీలకు లేదా సందేశాలకు తాను బాధ్యుడిని కానని ఆయన తేల్చిచెప్పారు.