కర్నూలు జిల్లాలో టీడీపీ రెబెల్ అభ్యర్థుల సస్పెన్షన్ కలకలం

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: కర్నూలు

కర్నూలు జిల్లాలో కూటమి నిర్ణయాన్ని ధిక్కరించి స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్న ఇద్దరు టీడీపీ నాయకులను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు జిల్లా అధ్యక్షుడు గుడిసె కృష్ణమ్మ ప్రకటించారు. ఆలూరు జడ్పీటీసీ స్థానానికి ఇండిపెండెంట్గా బరిలో నిలిచిన బెంగళూరు కిషోర్, హొళగుంద స్థానం నుంచి పోటీ చేస్తున్న ఇడిగ గోవిందుపై పార్టీ అధిష్టానం కఠిన చర్యలు తీసుకుందని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతమాత్రం ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు.