ములకలపల్లిలో అధికారుల ఏకపక్ష వైఖరి: సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరించిన సర్పంచులు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: ములకలపల్లి

ములకలపల్లి మండలంలో అధికారుల తీరును నిరసిస్తూ సగం మందికి పైగా సర్పంచులు సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరించినట్లు స్థానిక సర్పంచులు వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల జాబితాల కేటాయింపులో లోపాలు, అధికారుల అలసత్వంపై ఎమ్మెల్యే జారే ఆదినారాయణకు ఇప్పటికే ఫిర్యాదులు అందాయని వారు తెలిపారు. అధికారుల ఏకపక్ష వైఖరి కారణంగా రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్ లో పాలక పార్టీకి తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందని రాజకీయ పరిశీలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.