పేదల ఆర్థిక భరోసా కోసమే ఉపాధి హామీ పనులు
రిపోర్టర్: Gangadhar Reporter
స్థలం: జన్నారం
నిరుపేదల మేలుకోసమే ఉపాధి పనులను చేపట్టడం జరిగిందని జన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ అన్నారు. సోమవారం మధ్యాహ్నం ధర్మారం గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన గ్రామసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామాల్ లో ఉండే నిరుపేదలకు ఉపాధి కల్పిస్తూ స్థిరమైన ఆదాయం ఇచ్చేందుకు ఉపాధి హామీ పనులను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ అధికారులు అలాగే సిబ్బంది పాల్గొన్నారు.