భారీ వర్షాలపై సీఎం చంద్రబాబునాయుడు అత్యవసర సమీక్ష

రిపోర్టర్: సునీల్ స్థలం: Amaravati

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కారణంగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సమీక్ష నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకాకుళం–కవిటి మధ్య తుపాను తీరం దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రాణనష్టం జరగకుండా తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.