రేణిగుంట విమానాశ్రయంలో తప్పిన పెను ప్రమాదం

రిపోర్టర్: కిరణ్ స్థలం: తిరుపతి

రేణిగుంట విమానాశ్రయంలో ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దిల్లీ నుంచి హైదరాబాద్‌ మీదుగా వచ్చిన విమానం ల్యాండింగ్‌ సమయంలో సమస్య ఏర్పడటంతో పైలట్ అప్రమత్తమై ఆకాశంలోనే చక్కర్లు కొట్టించారు. గాల్లో కొన్ని నిమిషాల పాటు భయానక పరిస్థితులు నెలకొనగా, ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందారు. చివరకు విమానం సురక్షితంగా కిందకు దిగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.