కిల్లో రాజన్ కు బీసీవైపీ రాష్ట్ర సమన్వయ కమిటీ సభ్యుడిగా బాధ్యతలు
రిపోర్టర్: SINDERI KAMESH
స్థలం: పాడేరు
భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ ఆదేశాల మేరకు అల్లూరి సీతారామరాజు జిల్లా అధ్యక్షుడు కిల్లో రాజన్ కు పార్టీ రాష్ట్ర సమన్వయ కమిటీ సభ్యుడిగా నియమించారు. ఈ నియామకం పట్ల జిల్లా పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తూ పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి మరింత కృషి చేయాలని పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు పాంగి నవీన్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.