ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి
రిపోర్టర్: భాస్కర్
స్థలం: ఆదిలాబాద్
ఆదిలాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రిమ్స్ ఆసుపత్రి ఎస్ఎన్సీయూ వార్డులో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏసీ పేలి అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు పసికందులు ప్రాణాలు కోల్పోవడంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ముఖ్యమంత్రి, గాయపడిన చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని, ఘటనపై సమగ్ర విచారణ జరిపి ఫైర్ సేఫ్టీ చర్యలు పటిష్టం చేయాలని అధికారులను ఆదేశించారు.