ఖమ్మంలో సెప్టెంబర్ 22 నుంచి రేబిస్ అవగాహనా వారోత్సవాలు

రిపోర్టర్: amudala Venkanna స్థలం: ఖమ్మం అర్బన్

ఖమ్మంలో సెప్టెంబర్ 22 నుంచి 28 వరకు ప్రపంచ రేబిస్ అవగాహనా వారోత్సవాలు నిర్వహించనున్నట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ డి. రామారావు తెలిపారు. కుక్కలు, ఇతర జంతువులు కరిచిన వెంటనే గాయాన్ని సబ్బు, ప్రవహించే నీటితో 15 నిమిషాలు కడగాలని సూచించారు. గాయానికి పసుపు, మిరపపొడి, నూనె, మట్టి రాయకూడదన్నారు. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించి వైద్యుల సూచన మేరకు రేబిస్ వ్యాక్సిన్ తీసుకోవాలని తెలిపారు.